ఇది మా ఇంట్లో TV పై ఉండే ఫోటో . మా ఇంటికి వచ్చే వారిలో చాలామంది ఈ అందగాడిని చూసి ఎవరీయన ? అని అడగటం, నేను చెప్పటం చాలా సార్లు జరుగుతుంది.
మన బ్లాగర్లలో ఎంతమంది ఈయనను గుర్తు పడతారో చూద్దామని నా ప్రయత్నం. ఎవరైనా ప్రయత్నించండి.
క్లూ: ఈయన ఒక ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తి. ప్రస్తుతం జీవించి లేరు.
Wednesday, August 26, 2009
ఎవరీయన ?
Labels: అవీ ఇవీ
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 9:08 PM 8 comments
Monday, August 10, 2009
సౌందర్యం - చలం
ఆనందించే గుణం హెచ్చిన కొద్దీ ఒక stage లో సౌందర్యం బాధ పెట్టడం ప్రారంభిస్తుందని అంటారు చలం మ్యూజింగ్స్ లో ఒక చోట.
దీనికి ఉదాహరణగా చేతుల్లేని వీనస్ విగ్రహాన్ని గంటల కొద్దీ , రోజుల కొద్దీ అట్లానే చూసి దీపం చుట్టూ కీటకాల లాగ తిరిగి , చివరికి పిచ్చెక్కిన రసికుల గురించి చెప్తారు. స్వయంగా తనకు కూడా ఆ విగ్రహాన్ని కంఠం నుంచీ తొడలదాకా చూసిన కొద్దీ పిచ్చెక్కినట్లవుతుందని వ్రాస్తారు. ఏమిటీ ఈ బాధ? అని తర్కించి తర్కించి చివరికి సౌందర్యంలోనే ఈ గుణం ఉందని తేల్చుకుంటారు.
ఈ సందర్భంలో ఆయన వ్రాసిన ,నాకు యిష్టమయిన వాక్యాలు.
"సౌందర్యంలో ఈ అశాంతిని కలిగించే శక్తిని గురించి ఆలోచించగా ఆలోచించగా ఏమనిపిస్తుందంటే , ఈ సౌందర్యాన్ని ఆకర్షకంగా చేసే సూత్రం వుందే, దాంట్లో సౌందర్యం నుంచి మనసుని, సౌందర్యాన్ని మించి ఆ వస్తువుకి సౌందర్యాన్ని కల్పించే శక్తి దగ్గరికి ఈ బాధ ద్వారా దృష్టిని మళ్ళించే ప్రయత్నం ఉందేమో? ఈ జీవ శక్తి మల్లేనే మనసు కూడా నిరంతరమూ evolve కావాలని సృష్టి ఉద్దేశ్యం అయి వుంటుంది. అందువల్లనే దేనిలోనూ తృప్తి పడక, వూరికే అశాశ్వతమై ఎప్పుడూ మారే ఆశలతో ఆరాటపడుతూ వుంటుంది మనసు."
ఇలా ఈయన రచన శైలి అక్కడక్కడ అర్ధం చేసుకోవటం కొంచం కష్టం అనిపించినప్పటికీ, తరువాత చాలా ఇష్టంగా మారుతుంది. మ్యూజింగ్స్ చదివిన కొత్తల్లో నాకు కొన్ని వాక్యాల్ని అర్ధం చేసుకోవటం కష్టమయ్యింది. సౌందర్యంలో బాధ, బాధలో సౌఖ్యం వగైరాలు వినటానికి చిత్రంగా అనిపించినా అసహజాలేమీ కాదు.
ఎంతటి క్లిష్టమైన భావాన్నైనా పదాలుగా మార్చి వాక్యాలుగా వ్రాయగలగటంలో ఈయనకు ఈయనే సాటి అని నా అభిప్రాయం. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే మ్యూజింగ్స్ ఎప్పుడూ నాకూడానే వుంటుంది.
Labels: సాహిత్యము
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 7:48 PM 2 comments


