Sunday, September 27, 2009

తబలా

సంగీత వాయిద్యాలలో కెల్లా తబలా అన్నా , మృదంగం అన్నా నాకెంతో ఇష్టం . వీటిని దగ్గర నుంచి వింటూ నేనెంతో తన్మయత్వం పొందుతూ ఉంటాను.

అసలు ఒకప్పుడు (సుమారు నా 20 ఏళ్ళ వయసప్పుడు) నేను మృదంగం నేర్చుకుందామని ఇష్టపడి , వెతుక్కుంటూ ఒక గురువు గారి దగ్గరకు వెళ్లాను. ఆయన నేర్పటానికి అంగీకరించి , రోజూ నన్ను రమ్మన్నారు కూడా . నేను 3,4 రోజులు వెళ్లి త,ధీ,తోం,నం అంటూ మొదటి పాఠంతో చాలా కుస్తీ పట్టడం , నా వల్ల కాక మానేయటం జరిగింది . ఆ కాస్త సమయంలో నేను నేర్చుకున్నది అంటూ ఏమీ లేదు కానీ , అప్పట్నుంచీ ఆ సంగీతాన్ని విని ఆనందించే గుణం మాత్రం నాలో బాగా పెరిగింది. అప్పటినుండీ ఈ సంగీతానికి సంబందించి కాసెట్లూ , సి డి లూ వగైరా సేకరిస్తూ వస్తున్నాను. మన ఎల్లా వెంకటేశ్వర రావు (మృదంగం) గారి నుండి అల్లా రఖా , జాకీర్ హుస్సేన్ (తబలా) వరకూ అందరినీ వింటూ , నేనే వాయించుతున్నట్టు చేతులతో కనిపించిన దాన్నల్లా కొడుతూ, ఆనందిస్తూ ఉంటాను .
నా ఉద్దేశ్యం లో ఏ కళ ని అయినా పూర్తిగా ఆస్వాదించాలంటే (సగీతం కానీ , నాట్యం కానీ మరేదైనా కానీ) ఆ కళను సృష్టిస్తున్న కళాకారుడి తో ఐక్యం అయిపోయి మనమే ఆ కళను సృష్టిస్తున్న భావన పొందాలి . అప్పుడే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది.

ఇక్కడ ఓ 4 నిమిషాల తబలా విన్యాసాన్ని పెట్టాను విని ఆనందించండి.










2 comments:

కొత్త పాళీ said...

సంతోషం. నాకు చిన్నప్పుడు, అంటే స్కూలువయసులో మృదంగం నేర్చుకోవాలని మహా ఉండేది. చేతికి దొరికిన ప్రతీ డబ్బా మీదా బాది పారేస్తుండేవాణ్ణి. కానీ కుదర్లేదు నేర్చుకోవడం :(

రవీంద్రనాధ్ గెడ్డం said...

ధన్యవాదాలండీ. మీరూ నాలాగే అన్న మాట.