Thursday, May 15, 2008

విద్యార్ధి కింత కష్టం కలిగించింది ఎందు కో"సం"

ఈ మధ్య "నవతరం" లో "చదువులా చావులా " చూసిన తరవాత అంతకు ముందు ఎప్పుడో నాకు వచ్చిన ఒక ఇ-మెయిల్ గుర్తుకొచ్చింది. ఎక్కడినుంచి మొదలు పెట్టిందో ఏమో నా మేనల్లుడు పంపిన ఇ-మెయిల్ ద్వారా నాకూ చేరింది ఈ జవాబు పత్రం. చూడగానే మనసంతా ఏదోలా అయ్యింది. మీరూ చూడండి.













Friday, May 02, 2008

రామోజీ గారికి సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎందుకు పడేది కాదు?

ఈ రోజు "సాక్షి" సంపాదకీయం లో ఈటీవీ ప్రస్థావన వచ్చింది.ఈటీవీ ప్రసారం చేసే సినిమాల్లో దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన సినిమాలు ప్రసారం చేయాల్సి వస్తే ఆ సినిమా టైటిల్స్ నుంచి దాసరి నారాయణ రావు పేరు లేకుండా చేసి మరీ ప్రసారం చేసే వారట. ఇది నేను గమనించలేదు కాని గతంలో నేను గమనించిన విషయం ఒకటుంది అది ఏమిటంటే....

80 ల్లో సూపర్ స్టార్ గా వున్న కృష్ణ పట్ల ఎందుకు ద్వేషం పెంచుకున్నారో ఏమో రామోజీరావుగారు అప్పట్లో తమ పత్రికల్లో ఎక్కడా ఆయన పేరు కాని ఫోటో కాని రాకుండా జాగ్రత్త పడేవారు. ఆయన సినిమా పత్రిక అయిన సితార లో కూడా అప్పటికి ఎంతో ప్రజాదరణ తో హీరో గా వున్న కృష్ణ పేరును కాని, ఫోటోను కాని ప్రచురించే వారు కాదు. ఈ నిషేధాన్ని చాన్నాళ్ళు పాటించారు. తరువాత మెల్లగా నిషేధాన్ని తొలగించారు. బ్లాగర్లలో కొంతమందికైనా ఈ విషయం తెలిసే వుంటుంది.