Thursday, November 13, 2008

అంగుత్తరనికాయ

బ్లాగ్ వ్రాసి చాలా కాలం అయిపోయింది. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వ్రాద్దామనుకుంటుండగానే కాలం అలా గడిచిపోతూ ఉంది.

ఇవాళ ఏమైనా సరే ఏదో టపా వ్రాసి పోస్ట్ చేద్దామనే వుద్దేశ్యంతో పట్టుదలగా కాగితం ,పెన్ను పట్టుకుని కూర్చున్నాను.
ఏమి వ్రాద్దామా ? అని ఆలోచన మొదలైంది .ఎన్నో భావాలు వస్తున్నాయి . పోతున్నాయి. . ఒక దానికి విరుద్ధంగా మరొకటి. ఏదో వ్రాయ బోవడం , కొట్టివేయడం జరుగుతుంది .

ప్రతీ మనిషి లోనూ అనేక భావాలు రావడం పోవడం సహజమే కావచ్చు. కాని నా అనుభవమేమిటంటే ఏదైనా వ్రాద్దామని కూర్చున్న సమయంలోనే మిగతా సమయాల్లో కంటే ఎక్కువ భావాల చలనం వుంటుంది. .రచయితలు అందరూ కాకపోయినా కొందరైనా ఇలాంటి ఇబ్బందిని ఎరిగి వుంటారని నా వుద్దేశ్యం .

ఎంతసేపు కూర్చున్నా ఏదీ తేల్చుకోలేకపోయా.

ఈ తర్జన భర్జనకు త్వరగా ముగింపు పలికి ఏదో ఒకటి వ్రాద్దామనే సంకల్పంతో ఉపాయం తట్టక పోతుందా అని పాత డైరీ ఒకటి తిరగేసా . అందులో ప్రతి మనిషి నిరంతరం మననం చేసుకోవలసిన విషయాలుగా గౌతమ బుద్దుడు చెప్పిన "అంగుత్తరనికాయ" సారాంశం కనబడింది .ఎందులో చదివి వ్రాసుకున్నానో గుర్తులేదు కాని నాకు బాగానచ్చింది . ఇక ఆలోచన కట్టిపెట్టి అదే టపా గా వ్రాసి పోస్ఠ్ చేస్తున్నా . చదువుతారని ఆశిస్తా.

అంగుత్తరనికాయ
ప్రతీ మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు.
1. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
3. ఏదో ఒక రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది .దాన్ని నేను తప్పించుకోలేను.
4. నేను అమితంగా ప్రేమించి, నావి అని భావించే వస్తువులు , సంపద , ఆస్థి అన్నీ ఏదో ఒక రోజున మార్పుకు, నాశనానికి, లేదా ఎడబాటుకు లోనయ్యేవే . దాన్ని నేను తప్పించుకోలేను.
5. నేను చేసిన పనుల [ స్వకర్మల ] పలితంవల్లే నేను ఇలా తయారయ్యను . నా పనులు ఎటువంటివైనా, మంచివైనా చెడువైనా - వాటీకి నేను వారసుణ్ణి కావలసిందే.

అనారోగ్యాన్ని గుర్తుంచుకోవటం ద్వారా ఆరోగ్యం వలన కలిగే అహంకారాన్నీ, వృద్ధాప్యాన్ని గుర్తుంచుకోవటం ద్వారా యవ్వనం వలన కలిగే అహంకారాన్ని, మృత్యువును ధ్యానించటం ద్వారా జీవన విధానం వలన కలిగే అహంకారాన్ని, ప్రతి వస్తువులో కలిగే మార్పునీ, నాశనాన్ని ధ్యానించటంద్వారా, అన్నీ నాకే కావాలనే బలమైన కోరికను అణిచివేయవచ్చు లేదా కనీసం తగ్గించవచ్చు .మనం చేసే పనుల ఫలితాన్నే మనం అనుభవిస్తామన్న సత్యాన్ని మననం చేసుకోవటం ద్వారా ఆలోచనలలో, మాటలలో, పనులలో చెడు చేయాలనే దుర్మార్గ స్వభావం అణగారుతుంది. కనీసం తగ్గుతుంది.

5 comments:

శివ - teluguratna.com said...

చాలా మంచి విషయాలు చెప్పారు

చిలమకూరు విజయమోహన్ said...

మంచి విషయాలు చెప్పారు

laxmi said...

Good One

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

బావుందండి రవీంద్రనాధ్ గారు,మీకు ప్రస్తుతం ఏ అంశం మీద టపా రాయాలన్న సందిగ్దత తీరిపోయిన్ట్లే అని భావిస్తూ,అంగుత్తరనికాయ గురించి,ఈ టపా లోని సూత్రాల గురించి విశదీకరించగలరు.

రవీంద్రనాధ్ గెడ్డం said...

శివ , చిలమకూరు విజయమోహన్ & లక్ష్మి గార్లకు,
ధన్యవాదాలు.
రాజేంద్రకుమార్ దేవరపల్లి గారికి,
వీలువెంబడి ప్రయత్నిస్తా.
మీ సూచనకు ధన్యవాదాలు.