Sunday, June 29, 2008

కీడు లో మేలు

ఆంధ్ర జ్యోతికి, ఎమ్మార్పీఎస్ కి మధ్య వరుసగా జరుగుతున్న వివాదాలు చాలా విచారకరం. ఆలోచిస్తుంటే కీడులో మేలులా ,ఇది కూడా ఒకందుకు మంచిదే అనిపిస్తుంది నాకు.

పత్రికలు,మీడియా వారన్నా, ఎస్ సి,ఎస్ టి లన్నా చాలామంది ప్రజలు భయపడే స్థాయికి వారిని వారి నాయకత్వాలు కాని, యాజమాన్యాలు కాని తీసుకెళ్ళాయి. రాజ్యాంగం వెసలుబాటు అలా వుంది మరి. పత్రికా స్వేచ్చ హక్కు ద్వారా ఏది పడితే అది ఎలాపడితే అలా , ఆధారాలున్నా లేకపోయినా వ్రాసే అధికారం చేజిక్కించుకున్నారు పత్రికల వారు."బాడుగ నేతలు" కధనం ఒకటే కాదు. ఈ మధ్య జరిగిన పొట్టిలంక సంఘర్షణలో కూడా వీరి పోకడ గమనించవచ్చు. కొన్ని పత్రికలూ,చానెళ్ళూ అగ్రవర్ణాల దాడీ అంటూ అన్నీ కవర్ చేశారు కాని, అలా ఎందుకు దాడి చేసారు? అనే ప్రశ్నకు సమాధానం సరిగా లేకుండా చేసారు. బహుశ వార్తకు బరువు రావాలంటే ఆ సస్పెన్స్ అలా మెయిన్ టెయిన్ చేయాలేమో! అధారాలేమీ లేకున్నా వ్రాయగలరు. అలాగే వాస్తవాల్ని ఉద్దేశ్యపూర్వకంగా మరుగుపరచనూగలరు. (అమ్మాయిని పబ్లిగ్గా ముద్దుపెట్టుకున్నంత మాత్రాన దాడి చేయాలనికానీ, మనిషిని చంపేయాలని కానీ చెప్పడం నావుద్దేశ్యం కాదు .గమనించాలి.)

ఇక గ్రామాల దగ్గర నుంచి పట్టాణాల దాకా మిగిలిన కులాలవారు ఎస్ సి,ఎస్ టి లంటే భయపడే స్థాయికి ఎట్రాసిటీ కేసులద్వారా (చాలాసార్లు దుర్వినియోగపర్చడంద్వారా ) వారిని వారి నాయకత్వాలు తీసుకెళ్తున్నాయి. ఇలాగే సాగితే ముందుముందు వారితో లావాదేవీలన్నా ,వ్యవహారాలన్నా, వ్యాపారాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. చివరికి ఇదొకరకమైన అంటరానితనంగా మారినా మారవచ్చు. ఆ పరిస్థితులు వస్తే ఖచ్చితంగా ఈ కుల సంఘాల నాయకుల్నే బాధ్యులని చెయ్యాలి.

ఎవరికి వారుగా పత్రికలవారితో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవటం కానీ, ఎట్రాసిటి వగైరా చట్టాలను గురించి ప్రశ్నించటం టం కాని అయ్యే పని కాదు. బలమైన ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదం వల్లనైనా ఈ రెండిటి గురించి ప్రజల్లో చర్చ జరగడం మొదలయ్యింది . పోగా పోగా భవిష్యత్తులో ఏదైనా మంచి మార్పు రావటానికి ఇది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.

0 comments:


Blogspot Templates by Isnaini Dot Com and Insurance News. Powered by Blogger