ఈ రోజు "సాక్షి" సంపాదకీయం లో ఈటీవీ ప్రస్థావన వచ్చింది.ఈటీవీ ప్రసారం చేసే సినిమాల్లో దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన సినిమాలు ప్రసారం చేయాల్సి వస్తే ఆ సినిమా టైటిల్స్ నుంచి దాసరి నారాయణ రావు పేరు లేకుండా చేసి మరీ ప్రసారం చేసే వారట. ఇది నేను గమనించలేదు కాని గతంలో నేను గమనించిన విషయం ఒకటుంది అది ఏమిటంటే....
80 ల్లో సూపర్ స్టార్ గా వున్న కృష్ణ పట్ల ఎందుకు ద్వేషం పెంచుకున్నారో ఏమో రామోజీరావుగారు అప్పట్లో తమ పత్రికల్లో ఎక్కడా ఆయన పేరు కాని ఫోటో కాని రాకుండా జాగ్రత్త పడేవారు. ఆయన సినిమా పత్రిక అయిన సితార లో కూడా అప్పటికి ఎంతో ప్రజాదరణ తో హీరో గా వున్న కృష్ణ పేరును కాని, ఫోటోను కాని ప్రచురించే వారు కాదు. ఈ నిషేధాన్ని చాన్నాళ్ళు పాటించారు. తరువాత మెల్లగా నిషేధాన్ని తొలగించారు. బ్లాగర్లలో కొంతమందికైనా ఈ విషయం తెలిసే వుంటుంది.
Friday, May 02, 2008
Subscribe to:
Post Comments (Atom)



9 comments:
వీటి గురించి తెలియదండి.కానీ ద్వేషం అంటే రామోజీ రావు ఎన్ టీఆర్ కి పక్కన వుండేవాడు.కృష్ణకి,ఎన్ టీఆర్ కి పడేదికాదు అని విన్నాను.కృష్ణ కాంగ్రేసు తరుపున వెళ్ళాడు.ఈ విషయాలు చాలవూ కృష్ణని నిషేధించడానికి.
రామోజీ X కృష్ణ -ఇది నాకు కొత్త విషయం; ఎప్పుడూ గమనించలేదు. అప్పట్లో కృష్ణ పుట్టిన రోజు నాడు అభినందన ప్రకటనలతో దాదాపు ఆంధ్రజ్యోతి పేపరునంతా నింపేసేవారు సినిమావాళ్ళు, పిచ్చి అభిమానులు. కృష్ణకు కాక మరే హీరోకూ నేనది చూడలేదు -ఇప్పటిదాకా! ఈనాడులో మాత్రం వచ్చేవి కావు. రామోజీకా కసి ఉండేదేమో, మరి! :)
రాధిక గారూ, రామోజీ రామారావుతో కలిసింది 1983లోనే. కానీ కృష్ణకీ ఎన్టీయారుకీ ఉండే స్పర్థ దానికి ముందుది కదా!
చదువరి గారు: మీకు తెలియదనీ మీరు గమనించలేదనీ నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేశారుగా :-)
ఇక విషయంలోకి వెళితే రాధిక గారు చెప్పింది నిజమే ... చదువరి గారు, ఇది రాజకీయ స్పర్ధ, సినిమా రంగంలోనిది కాదు. అన్నగారు ముఖ్యమంత్రి అయిన తరువాత పద్మాలయా, అన్నపూర్ణ స్టూడియోలలో ఉన్న మిగులు స్థలాలపై దాడిచేయటం జరిగింది.(మొన్నటికి మొన్న ఇప్పటి రాజశేఖరుని హయాంలో కూడా జరిగిన దాడి గుర్తు ఉంది కదా మీకు .. అలాంటిదే .. కాకపోతే ఇప్పుడు పద్మాలయా వాళ్లు అమ్మటం జరిగింది అందుకే దాడి .. కానీ అప్పుడు వీళ్లు స్టూడియోకని ఇచ్చిన స్థలాన్ని సరిగ్గా వాడకుండా అలాగే ఉంచారు అని అన్నగారికి కోపం మరియు సినిమా రంగం నుంచి కాగుతూ వచ్చిన చిన్న చిన్న కారణాలు మరికొన్ని). నాగేశ్వరరావు గారు ఏ దశలోనూ తెలుగుదేశానికి సపోర్ట్ చేయకపోవటానికి ఇది కూడా ఒక ప్రధమ కారణం. ఇకపోతే అన్నగారు సినీరంగ నిష్క్రమణతో సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు చలనచిత్ర సీమను అప్రతిహతంగా ఏలుతున్న (మరియు చిరంజీవి గారు అప్పుడప్పుడే పైకి వస్తున్న) కాలం కావటంతో అంటే సంపాదన కూడా బాగా ఉండటంతో ఆదాయపు పన్ను దాడులు బాగా తీవ్రంగా జరగటం, తప్పించుకునే దాడికాన రాక రాజీవ్ గాంధిని ఆశ్రయించటం ఆయా కేసుల్లోనుంచి బయటపడటం, దానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ లో చేరటం చకచకా జరిగిపోవటం మనకందరికీ తెలిసిందే. ఇక మన ముసలాయన (భూమిక, ఛార్మీ, అనుష్క వేదిక మీద కనపడనప్పుడు మాత్రమే లేండి :-) అదేనండి నాగేశ్వరరావు గారు ... ) ఇట్లాంటి డబ్బులెక్కల్లో కొద్దిగా ముదురు కాబట్టి ఆయనకు పెద్ద ఇబ్బంది ఏమీ ఎదురుకాలేదు.
ఇలా కృష్ణ కాంగ్రెస్ లో చేరటం అంతగా రుచించని రామోజీ గారు తన సితార పత్రిక నుంచి కృష్ణ చిత్రాలను, ఆఖరుకు పేరును కూడా పూర్తిగా బహిష్కరించటం జరిగింది. కృష్ణ ఫొటో మొదటి పేజ్ లో, ఒకవేళ అక్కడ లేకపోతే రెండవ పేజ్ లో (కవర్ పేజ్ వెనుక) మొదటి ఫొటో లేకపోతే సెంటర్ స్ప్రెడ్ లేకుండా అప్పటివరకు సితార అసలు ఎప్పుడూ రాలేదు. బహిష్కరణ అంటే ఎలా ఉంటుందో ఆ రోజుల్లోనే చూపించిన ఘనత రామోజీ గారిది.
దాసరి గారితో గొడవ వచ్చిన తరువాత అదే విధానాన్ని తన టి.వి మీడియాకు విస్తరింపజేశారు అంతే తేడా. (ఈ దాసరి గారు కూడా ఏమీ తక్కువ తినలేదు లేండి .. సాధ్యమైనంత వరకు తను అటెండ్ అయ్యే ఫంక్షన్స్ కి ఈ-టివి కవరేజ్ ఉంటే రానని చెప్పటమే కాకుండా దానిని కొన్ని సందర్భాలలో విజయవంతంగా బహిష్కరించేలా చేయగలిగిన గొప్పవారే)
ఇంత చెప్పుకున్నాము కాబట్టి చివరగా ఇంకో కొసరు ముక్క : అగ్నిపర్వతం సినిమా గుర్తు ఉంటే అందులో కృష్ణ గారి సింగిల్ సాంగ్ లో(ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం ...) చివరలో అద్దం పగలగొట్టి తన గుండెల మీద చేతి ముద్ర వేయటం జరుగుతుంది .. కానీ ముందు అనుకున్నప్పుడు చేతి గుర్తు అలా వేసుకోవటం లేదు కానీ కృష్ణ అప్పటికే కాంగ్రెస్ అభిమాని కావటంతో ఆ సినిమాకు దర్శకుడైన మన దర్శకేంద్రుడికి కోపం రావటం ... కృష్ణ-రాఘవేంద్రరావు (ఈ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్) మధ్య మనస్పర్ధలు రావటంతో (ఇద్దరూ మంకుపట్టు వీడకపోవటంతో) వారిద్దరి కాంబినేషన్ లో ఇంకే సినిమా (అప్పటికే నిర్మాణంలో ఉన్న వజ్రాయుధం సినిమాను పూర్తిచేశారు అంటే) రాలేదు. ఈ సినిమా విడుదల సమయంలోనే కృష్ణ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవటం ఖరారు కావటంతో దాని ప్రభావం ఈ సినిమా ఫలితంపై పడింది లేకపోయుంటే ఆ సినిమా విజయం, పాటలు, డైలాగ్స్, కృష్ణ నటన మొదలగునవి తెలుగు చలనచిత్రసీమలో చిరస్థాయిగా నిలిచిపోయుండేవి. ఈ సమస్య చివరకు కృష్ణే మహేష్ ను తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేయాలి అనుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారిని కలవటంతో సమసిపోయింది.
రాధిక , చదువరి , తెలుగు"వాడి"ని గార్లకు
నెనరులు.
ముఖ్యంగా తెలుగు"వాడి"ని గారి వ్యాఖ్య చాలా "వాడి" గా వుంది. చాలా మందికి తెలియని విషయాలు వ్రాశారు.మరొక్కసారి నెనర్లు .
అవును...రామోజీ కీ క్రిష్ణ కీ ప్రత్యక్ష వైరం ఏదీ లేదు...కేవలం రాజకీయవైరుద్యం తప్ప...నాకు ఇప్పటికీ గుర్తు....సితార లో క్రిష్ణ సినిమా సమీక్ష లో గుడిపూడి శ్రీహరి గారు ఇలా అనేవారు..."క్రిష్ణ తన 'సహజ' నటనని మరో సారి ప్రదర్శించారు"
బుజ్జి గారూ,
మీరన్నది నిజమే.
అందరు చెప్పింది correct. గొప్పతనం ఏమిటంటే, ఏ సభలలో కాని, సమావేశాలలో కాని, వేరే పత్రికలలో కాని కృష్ణ గారు ఈ బహిష్కరణ విషయమే ప్రస్తావించేవారు కారు direct or indirect గా కాని.
తెలుగు 'వాడిని ' గారూ,
తెలియని విషయాలు చాలా చెప్పారండి!
బుజ్జి గారు, అవును సుమా, గుడిపూడి శ్రీహరి గారు అలాగే రాసే వారు. ఇప్పుడు గుర్తొస్తోంది.
కృష్ణారావు గారూ,
కృష్ణ గారు సినీ ఫీల్డ్ లో ఎంతో డేరింగ్. ఆయన వ్యక్తిత్వం నిండుకుండ లాంటిది.
సుజాత గారూ,
నెనర్లు.
Post a Comment